పవన్*కల్యాణ్* కథానాయకుడిగా కనకరత్న మూవీస్* సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'కొమరం పులి'. నిఖిషా పటేల్* ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతోంది. 'ఖుషి' రూపకర్త ఎస్*.జె.సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే నెల 1 నుంచి '.. పులి' చిత్రీకరణ మొదలవుతుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్*ని నిర్మించారు. ఇప్పటికే ఇందులో పలు కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ''పవన్*కల్యాణ్* చలన చిత్ర పరంపరలో ఇదీ సంచలనాత్మకంగా నిలుస్తుంది. ఆయన నటన, పాత్ర అందరికీ అమితంగా నచ్చుతాయి. ఈ షెడ్యూల్* చిత్రీకరణ పూర్తయ్యే వరకూ సాగుతుంది'' అన్నారు చిత్ర నిర్మాత శింగనమల రమేష్*బాబు. '.. పులి'లో మనోజ్* బాజ్*పాయ్*, చరణ్*రాజ్*, నాజర్*, జ్యోతికృష్ణ, శరణ్య, బ్రహ్మాజీ, అలీ, వీఎమ్*సీ హనీఫా, గిరీష్* కర్నాడ్* తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: ఎస్*.సత్యరామమూర్తి, సంగీతం: ఎ.ఆర్*.రెహమాన్*, ఛాయాగ్రహణం: బినోద్* ప్రధాన్*, కళ: ఆనంద్*సాయి, ఎగ్జిక్యూటివ్* నిర్మాత: బి.బుల్లిసుబ్బారావు.







Reply With Quote




Bookmarks